వరంగల్ కమిషనరేట్ పరిధిలో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ మోటార్లు దొంగిలిస్తున్న ముఠాను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.18.44 లక్షల విలువైన 84 మోటార్లు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వెల్లడించారు. నిందితులను పట్టుకున్న పోలీసు సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు.
