Monday, November 16, 2026

బిర్యానీ ఆలస్యంపై ప్రశ్నించిన కస్టమర్‌పై హోటల్ ఓనర్ దాడి!

పరకాల: దీపావళి రోజు సాయంత్రం పరకాల పట్టణంలోని ఓ ప్రముఖ బిర్యానీ హోటల్‌లో చోటుచేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిర్యానీ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు వడ్డించడంలో జాప్యం కావడంతో సిబ్బందిని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన హోటల్ యజమాని సదరు కస్టమర్‌పై చేయి చేసుకున్నట్లు తెలిసింది. అసలు అక్కడ ఏం జరిగిందనే దానిపై స్పష్టత లేకపోయినా, కస్టమర్‌పై దాడి ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. హోటళ్లలో వినియోగదారులతో మర్యాదగా వ్యవహరించాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

Latest Articles