పరకాల: మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అధికారుల హాజరు, విధుల నిర్వహణ, కార్యాలయ పనితీరును పరిశీలించారు. మున్సిపాలిటీకి సంబంధించిన రికార్డులను తనిఖీ చేసి, పట్టణ అభివృద్ధి పనులు, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కొంతమంది అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.
