పరకాల బస్టాండ్ నుంచి అంబాల మీదుగా హనుమకొండ వెళ్లే బస్సులు బస్టాండ్ మూలమలుపు వద్ద యూటర్న్ తీసుకోవడానికి తగిన స్థలం లేక డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బస్సులు మలుపు తిరిగే సమయంలో ఇతర వాహనాలు, పాదచారులకు ప్రమాదం పొంచి ఉంది. అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకముందే స్థలాన్ని పరిశీలించి, యూటర్న్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందిస్తారా.. ముందే చర్యలు తీసుకుంటారా? అధికారులే సమాధానం చెప్పాలి!
