పరకాల పట్టణంలో నంబర్ ప్లేట్లు లేని ఆటోలు, టీవీఎస్ వాహనాలు, స్కూటీలు, బైకులు యథేచ్ఛగా తిరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నంబర్ ప్లేట్లు లేకుండా ఓవర్ స్పీడ్తో దూసుకెళ్తున్న వాహనాలతో ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. వాహనం ఎవరిదో గుర్తించడం కష్టంగా మారితే బాధ్యత ఎవరిది? ఇప్పటికైనా పోలీసులు, రవాణా శాఖ అధికారులు స్పందించి తనిఖీలు ముమ్మరం చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగాక స్పందిస్తారా? ముందే చర్యలు తీసుకుంటారా? అధికారులు సమాధానం చెప్పాలి!
