Thursday, October 22, 2026

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం

పరకాల, అక్టోబర్ 21, (పీసీడబ్ల్యూ న్యూస్): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పరకాలలోని లలిత కన్వెన్షన్ హాల్లో 22 వ తారీకు రోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా రక్తదాన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ, సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశాన్ని అందిస్తున్నారు. ప్రజల రక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవా స్ఫూర్తినిt కొనసాగించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రక్తం అవసరమైన వారికి సకాలంలో రక్తం అందక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. రక్తదానం ఒక గొప్ప మానవతా సేవ అని, మనం ఇచ్చే రక్తం ప్రమాదాల్లో గాయపడినవారికి, శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులకు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ప్రాణదానంగా మారుతుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. చిన్న సహాయం ఒక ప్రాణాన్ని కాపాడగలదు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే కాకుండా, సమాజం పట్ల మన బాధ్యతను చాటుకోవచ్చని సూచిస్తున్నారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమంలో ప్రజలు, యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని పరకాల ఏసీపీ, పరకాల సిఐ, ఎస్సైలు కోరుతున్నారు.

Related Articles

Latest Articles