పరకాల: పట్టణంలో బాధితుల పక్షాన సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ వార్తలు రాస్తున్న ఓ విలేఖరికి ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ప్రజా సమస్యలు, బాధితుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా వార్తలు రాస్తున్నందుకు కొందరు వ్యక్తులు అసహనం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జర్నలిస్టుల స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పలువురు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు ఫోన్ కాల్ వివరాలను పరిశీలించి, బెదిరింపులకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
