Friday, September 18, 2026

నూతన సీఐ ప్రవీణ్‌ కుమార్‌కు 21వ వార్డు బీఆర్‌ఎస్‌ నాయకుల శుభాకాంక్షలు

పరకాల పట్టణంలోని 21వ వార్డు బీఆర్‌ఎస్‌ నాయకులు శుక్రవారం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పరకాల పోలీస్‌ స్టేషన్‌ సీఐ ప్రవీణ్‌ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐ ప్రవీణ్‌ కుమార్‌కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వార్డు పరిధిలోని ప్రజా సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై నాయకులు సీఐతో చర్చించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించేలా పోలీసు శాఖ సేవలు అందించాలని కోరారు. నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌ కుమార్‌కు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఒంటేరు చక్రి, చెన్న ఉమాపతి, మాదాసి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles