హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,580 పెరిగి రూ.1,54,420కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,450 ఎగబాకి రూ.1,41,550 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు. వీటికి అదనంగా 3 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
