పరకాల, సెప్టెంబర్ 17 (పీసీడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలో ఓ వ్యక్తి విలేకరిగా చలామణి అవుతూ పోలీస్ స్టేషన్‌లో జరుగుతున్న పంచాయతీల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల నడికూడ మండలానికి చెందిన ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి, తన కుమార్తె చదువు లేదా వివాహం కోసం దాచుకున్న డబ్బును గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ డబ్బుల విషయంలో వివాదం తలెత్తడంతో పరకాల పోలీస్ స్టేషన్‌లో జరిగిన పంచాయతీలో సదరు విలేకరి డబ్బులు ఇచ్చిన వ్యక్తికి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అంతేకాకుండా, సదరు వ్యక్తికి గతంలో ఓ కిడ్నాప్ కేసుతో సంబంధం ఉందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు జరిగిన అన్యాయాన్ని పీసీడబ్ల్యూ న్యూస్ ఆఫీస్ కి భార్య భర్తలు వచ్చి వివరించి, న్యాయం చేయాలని వేడుకున్నట్లు సమాచారం. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని బాధితులు బాధపడుతూ గ్రామంలో ఉన్న పెద్దలకు కూడా చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ నిరుపేద కుటుంబం కి ఇటీవల నోటీసు కూడా పంపించినట్లు తెలిసింది.. ఇదెక్కడి న్యాయం నా దగ్గరే డబ్బులు తీసుకొని నాకే నోటీసు పంపడం ఇదెక్కడి న్యాయమని అతను బోరున ఏడుస్తున్నాడు. ఈ విషయం పక్కన పెడితే డబ్బులు ఇచ్చిన వ్యక్తికి సపోర్ట్ చేయకుండా డబ్బులు తీసుకున్న వ్యక్తికి ఒక విలేకరి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి విలేకరిని పోలీసులు గాని ఇంటలిజెన్స్ గాని ఎందుకు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అతనిపై కిడ్నాప్ కేసు అలాగే పలు కేసులు ఉన్నట్లు అనుమానం ఉన్నట్లు బాధితుడు తెలియజేశాడు.
