పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా పరకాల సీఐగా ఏ. ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. బదిలీ అయిన అధికారులు సంబంధిత స్థానాల్లో త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. పరిపాలనా అవసరాలు, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ బదిలీలు చేపట్టినట్లు పోలీస్ శాఖ వర్గాలు తెలిపాయి.
