పరకాల, జూలై 30: పరకాల పట్టణంలోని జయ డీలక్స్ రోడ్డులో ఉన్న ఆర్కే సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని యజమాని రాజు ఆరోపించారు. దామిని మిరప విత్తనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేయడం వెనుక ఉద్దేశపూర్వక ప్రయత్నాలు ఉన్నాయని ఆయన అన్నారు. గురువారం వరి కోల్ గ్రామానికి వెళ్లి దామిని విత్తనాలు కొనుగోలు చేసిన రైతులను స్వయంగా కలిసి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. ఆ రైతులు స్పందిస్తూ, తమ పొలంలో విత్తనాలు బాగా మొలకెత్తాయని, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పినట్లు రాజు వెల్లడించారు. వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేయవద్దని, రైతులు నాణ్యమైన సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.
