Saturday, July 4, 2026

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. డాక్టర్ రోహిత్ సాదు

పరకాల. పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ రోహిత్ సాదు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటి నుంచే పిల్లల్లో మంచి అలవాట్లు పెంపొందించడం ద్వారా బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించవచ్చని పేర్కొన్నారు.భోజనం చేసే ముందు,తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవడం,డైనింగ్ టేబుల్‌ను భోజనం అనంతరం శుభ్రం చేయడం,చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్త బుట్టలో వేయడం వంటి అలవాట్లు ప్రతి విద్యార్థి అలవరచుకోవాలని సూచించారు.అలాగే అవసరం లేనప్పుడు విద్యుత్ దీపాలు,ఫ్యాన్లు,నీటి కుళాయిలను వృథాగా నడవనీయకుండా పొదుపుగా వినియోగించాలని తెలిపారు.చదువుతో పాటు సంస్కారం కూడా పిల్లల భవిష్యత్తుకు ఎంతో అవసరమని,తల్లిదండ్రులు పిల్లలకు నిత్యం మంచి విలువలను బోధించాలని అన్నారు.ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని,పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని డాక్టర్ రోహిత్ సాదు పిలుపునిచ్చారు.పరిశుభ్రమైన పరిసరాలు,పచ్చదనం,బాధ్యతాయుతమైన జీవన విధానం ద్వారానే భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Latest Articles