Tuesday, June 30, 2026

వార్షిక తనిఖీల్లో భాగంగా కాటారం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ

భూపాలపల్లి, జూన్ 30 పిసిడబ్ల్యూ న్యూస్:  జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ వార్షిక తనిఖీల్లో భాగంగా కాటారం పోలీస్ స్టేషన్‌తో పాటు కాటారం సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని సందర్శించి సమగ్ర తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్టేషన్ పరిశుభ్రత, పరిసరాల నిర్వహణ, రికార్డుల నిర్వహణ విధానం, సిబ్బంది విధి నిర్వహణను పరిశీలించిన ఎస్పీ, నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసుల పరిష్కారంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి పౌరుడికి స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తూ, వారి సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించేలా సేవలు అందించాలని సిబ్బందికి ఆదేశించారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు.

Related Articles

Latest Articles