Friday, July 3, 2026

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరకాలలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు

పరకాల పట్టణంలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు రాత్రి వేళల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు మున్సిపాలిటీ అధికారులు ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు, కాలనీలు మరియు అవసరమైన ప్రాంతాల్లో పాత లైట్ల స్థానంలో కొత్త ఎల్ఈడీ లైట్లను అమర్చే పనులు కొనసాగుతున్నాయి. మున్సిపాలిటీ ఎలక్ట్రిషియన్లు బొచ్చు ఆదినారాయణ, గుస్సా రవి మాట్లాడుతూ, ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు వీధి దీపాలను ఆఫ్ చేసి, సాయంత్రం 6 గంటలకు తిరిగి ఆన్ చేసేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు చీకటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యగా ఈ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలకు మెరుగైన వీధి వెలుతురు అందించేందుకు మున్సిపాలిటీ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

 

Related Articles

Latest Articles