Tuesday, July 21, 2026

గడ్డం కేశవమూర్తికి పద్మశాలి నేతల సన్మానం!

హనుమకొండ టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన గడ్డం కేశవ మూర్తికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం జిల్లా, రాష్ట్ర కమిటీ నేతలు కండువాతో ఘనంగా సన్మానించారు.ఇటీవల జరిగిన హనుమకొండ జిల్లా ఐజేయు యూనియన్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన గడ్డం కేశవమూర్తి హనుమకొండలోని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించి,శుభాకాంక్షలు తెలిపిన పద్మశాలి సంఘ నేతలు. భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరించి అటు జర్నలిస్టు సమాజానికి, ఇటు పద్మశాలి సమాజానికి సేవలు అందించాలని జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం కోరారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, జర్నలిజంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న కేశవమూర్తి కి పద్మశాలి సంఘం తరఫున అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైద్య రాజగోపాల్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పులికంటి రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షులు నల్ల సత్యనారాయణ, భద్రకాళి దేవాలయం ధర్మకర్త బింగి సతీష్ ఉన్నారు.

Related Articles

Latest Articles