పరకాల, మే10 పిసిడబ్ల్యూ న్యూస్: దేశ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు గౌరవ ప్రధానమంత్రి Narendra Modi హైదరాబాద్‌కు విచ్చేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ విజయవంతం కావాలని పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జెంకి పూర్ణాచారి ఆధ్వర్యంలో వార్డు ప్రజలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ బెజ్జెంకి పూర్ణాచారి మాట్లాడుతూ దేశ ప్రగతి, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న భారీ సభకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
