Saturday, June 6, 2026

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న బండి శ్రీధర్

పరకాల పట్టణంలోని 16వ వార్డు అంబేద్కర్ సెంటర్ పరిధిలో గత ఐదు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిన వెంటనే ప్రజా నాయకుడు బండి శ్రీధర్ స్పందించారు. సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకొని వేగంగా స్పందించడం ద్వారా బండి శ్రీధర్ మరోసారి ప్రజా నాయకుడిగా తన బాధ్యతను చాటుకున్నారు. ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు దృష్టి సారిస్తూ, పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయడం ఆయన ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ కార్యక్రమంలో 16వ వార్డు నాయకులు ఐలపెల్లి స్వామి, బండి రాజు, గోవింద ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను వివరించగా, త్వరితగతిన పరిష్కారం లభించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles