పరకాల రూరల్: వెల్లంపల్లి గ్రామంలో జై భీమ్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉచిత రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ సహకారం అందించింది. కార్యక్రమాన్ని సొసైటీ అధ్యక్షుడు బొట్ల అరుణ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ప్రారంభించారు. అనంతరం గ్రామానికి చెందిన అనేక మంది యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా కాకి సారంగపాణి రక్తదాతలకు ఫ్రూట్స్ మరియు గుడ్లు పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మచ్చ మహేందర్ పాల్గొనగా, మాజీ సర్పంచ్ వేలగందుల కృష్ణ, శనిగరపు రాజు, బిగ్ బాస్, బొట్ల జయపాల్, కేతపాక రవి, మచ్చ సురేష్, వంగర రాజు, జి.ఎం. కుమారస్వామి, నుటంకి రమేష్, బొట్ల రత్నాకర్, తెలంగాణ చందు, తిక్క గణేష్, హేమంత్ అనిల్, బరిగెల అనిల్, బరిగెల సాయి, వడ్ల నవీన్, గజ్జి నిష్, తిక్క జింటు తదితరులు హాజరయ్యారు. అలాగే జై భీమ్ యూత్ తరఫున సలహాదారులు మచ్చ వినోద్, ఇంచార్జి కాకి శరత్ చంద్ర, కార్యదర్శి మచ్చ టెనం, ఆర్గనైజర్ భవేష్, కోశాధికారి సుమంత్, ఏకు శ్రీనివాస్, పెండెల దుర్గాప్రసాద్, మచ్చ చరణ్ తదితరులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరంలో గ్రామంలోని యువజన సంఘాలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టే విధంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా నిర్వహించాలని నిర్వాహకులు పేర్కొన్నారు.
