Wednesday, July 22, 2026

సంగారెడ్డి జిల్లాలోనే ఎన్నికల జరపాలి: ఆదూరి మారుతి రాజు

సంగారెడ్డి: తెలంగాణ భట్రాజు సంఘం జిల్లా ఎన్నికలు రసవత్తరంగా మారాయని తెలంగాణ భట్రాజు సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఆదూరి మారుతీ రాజు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించకుండా ఎన్నికలు నిర్వహించడం, జిల్లాలకు సంబంధంలేని వ్యక్తులకు ఇతర జిల్లాలో పోటీ చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల నిర్వహించకుండా బీరంగూడ లో నిర్వహించడం జిల్లాకు సంబంధం లేని వారిని ప్రోత్సహిస్తున్న వారి పై సంఘ పెద్దలకు ఫిర్యాదు చేస్తామని, సంగారెడ్డి జిల్లా ఎన్నికల్లో ఇతర జిల్లాల వ్యక్తులు పోటీ చేయొద్దని ఈ సందర్భంగా అన్నారు.రాష్ట్ర నాయకత్వం ఈ విషయం పై నిర్ణయం తీసుకోవాలని అలా జరగని పక్షంలో ఇతర జిల్లా వ్యక్తులకు ఏ జిల్లాలోనైనా పదవులు ఇస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఏ జిల్లా వ్యక్తులు ఆ జిల్లాలోని పోటీ చేయాలని బైలాలో ఉన్న వివిధ విధానాలు తప్పకుండా పాటించాలని, ప్రజా పాలనలో ఉన్నామా రాజ్యాంగ పాలనలో ఉన్నామా అని ప్రశ్నించారు. అలా కాదని ఏకపక్ష నిర్ణయం తీసుకుంటే న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అవసరమైతే న్యాయస్థానం వరకైనా వెళ్తామని ఈ సందర్భంగా మారుతి రాజు అన్నారు.

Related Articles

Latest Articles