హన్మకొండ: ఫిబ్రవరి 29 ( పిసి డబ్ల్యూ న్యూస్: కాకతీయ ప్రభుత్వ కళాశాలలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో లో సుమారు 300 కు పైగా వివిధ రాజనీతి శాష్ట్రానికి సంబంధించిన ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పుస్తకాలను ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ Prof G. శ్రీనివాస్ గారు ప్రసంగిస్తూ కృత్రిమ మేధ, సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ఈ కాలం లో పుస్తక పఠనo ను ప్రోతహించే విధంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసిన రాజనీతి శాస్త్ర విభాగాన్ని అభినందించడం జరిగింది. విభాగ అధిపతి Dr. B. కవిత మాట్లాడుతూ కార్లమర్క్స్, H. J. లాస్కి,గ్రాడవిల్ ఆష్టిన్, థామస్ హబ్స్, లేవియదన్ జాన్ లాక్, రూసో సోషల్ కాంట్రాక్టు, D. D. బసు, భార్గవ, లాంటి వారి ప్రముఖ రచనలతో బాటు సివిల్స్, గ్రూప్స్ మరియు అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఉపయోగ పడే పోటీ పరీక్షల పుస్తకాలు రాజనీతి శాస్త్ర విభాగం విద్యార్థులకి అందుబాటులో ఉంచుతుంది అన్నారు. ఈ కార్యక్రమం లో రాజనీతి శాస్త్ర విభాగానికి చెందిన Dr. B. కవిత M. రవికుమార్, Prof k. శ్రీదేవి, v.రాజేందర్ మరియు వైస్ ప్రిన్సిపాల్ రజనీలత,Dr. శ్రీనాథ్, లైబ్రరియన్ భరత్ కుమార్, Dr. దినకర్, Dr.రవీందర్,Dr. ఇందిరాదేవి, Dr. వెంకటరమణ,Dr. Dr. ప్రదీప్ శ్రవణ్ Dr. దినేష్, Dr. స్వామి, Dr. వెంకన్న, Dr. రమేష్ మరియు అన్ని విభాగా ల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
