Saturday, March 7, 2026

కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు..

ఏటూరునాగారం: కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏటూరునాగారం గ్రామానికి చెందిన మెరుగు రఘు గౌడ్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అభిషేకాలు, అర్చనలు చేసి కెసిఆర్ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని ప్రార్థించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కెసిఆర్ నాయకత్వాన్ని కొనియాడిన రఘు గౌడ్, రాష్ట్ర అభివృద్ధి పథంలో ఆయన చూపిన దిశ ప్రజలకు ఆదర్శమని పేర్కొన్నారు. పేద ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం చేపట్టిన పథకాలు గ్రామీణ స్థాయిలో సానుకూల మార్పులకు దారితీశాయని తెలిపారు. భవిష్యత్తులో కూడా తెలంగాణ ప్రజలకు ఆయన మార్గదర్శకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ తెచ్చిన కెసిఆర్ బాపు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని, రైతులకు వెన్నుదన్నుగా నిలిచే పాలన కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని కెసిఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.పూజల అనంతరం ప్రసాదాన్ని పంపిణీ చేసి కార్యక్రమాన్ని ముగించారు.

Related Articles

Latest Articles