సూర్యాపేట జిల్లా కేంద్రం లో జరిగిన రాష్ట్ర సదస్సులో రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన జిల్లా ప్రతినిధుల సమక్షంలో నూతనంగా కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దానిలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా హన్మకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన గౌడ ముద్దు బిడ్డ ఆముదాలపేల్లి మల్లేశం గౌడ్ ను రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతు గీత వృత్తినే నమ్ముకొని వృత్తిని చేస్తున్న గీత కార్మికులకు ఏలాంటి ఆపద వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని నన్ను రాష్ట్ర కమిటి సభ్యులుగా ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షుడు ఎం వి రమణ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లకు హన్మకొండ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు గౌని సాంబయ్య గౌడ్ జిల్లా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి రంజిత్ గౌడ్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
