పరకాల మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తుది దశకు చేరుకుంది. నాలుగు గంటల వరకు సుమారు 70 శాతం పోలింగ్ నమోదు అయినట్లు సమాచారం. ఓటర్ల తీర్పు ఏవైపు మొగ్గు చూపుతుందో అన్న ఉత్కంఠ మధ్య రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పి సి డబ్ల్యూ నిర్వహించిన సర్వే సంచలనంగా మారింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద నిర్వహించిన ఓటర్ సర్వే ప్రకారం — అధికార కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నట్లు సమాచారం. టీఆర్ఎస్ 8 వార్డులకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా
బీజేపీ 2 స్థానాల్లో మెరుగైన స్థితిలో ఉన్నట్లు సర్వే చెబుతోంది. పరకాలలో త్రిముఖ పోటీ నెలకొన్నప్పటికీ, పోలింగ్ సరళి అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనిపిస్తోందని సర్వే విశ్లేషణ వెల్లడిస్తోంది.
అయితే తుది ఫలితాలు అధికారిక లెక్కింపుతోనే తేలనున్నాయి. ఓటర్ల తుది తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.
ఫ్లాష్… ఫ్లాష్… పరకాలలో ఉత్కంఠ భరిత పోలింగ్!
