Saturday, March 7, 2026

18వ వార్డు నుంచి బండి శ్రావణి నామినేషన్..

పరకాల పట్టణంలో మొత్తం 22 వార్డులకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. నామినేషన్ల చివరి రోజున పట్టణంలో రాజకీయ వాతావరణం ఉత్సాహంగా మారింది. “నువ్వా నేనా” అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో 18వ వార్డు నుంచి బండి శ్రావణి కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను స్థానికంగా నివసిస్తూ ప్రజలతో నిత్యం మమేకమై వార్డు సమస్యలను తెలుసుకుంటూ సేవలందిస్తున్నానని తెలిపారు. ప్రజల అవసరాలు, అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, వార్డు బాగోగులు చూసుకుంటూ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. 18వ వార్డు కౌన్సిలర్‌గా తనను గెలిపించి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.


కావాలంటే ఇదే న్యూస్‌ను హె

Related Articles

Latest Articles