Saturday, March 7, 2026

మేడారం జాతరలో అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి చేర్చిన కేజీ సి ఏ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు..

మేడారం: జనవరి 28 పిసి డబ్ల్యూ న్యూస్: కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న మేడారం మెగా క్యాంపు లో పాల్గొంటున్న కాకతీయ ప్రభుత్వ కళాశాల అటానమస్ హనుమకొండ వాలంటీర్లు నేడు జాతరలో మహారాష్ట్ర నుండి వచ్చిన రెండున్నర సంవత్సరాలు బాలిక అస్వస్థతకు గురికాగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఆస్పత్రికి చేర్చి ఆ అమ్మాయిని రక్షించినారు. అంతేకాకుండా ఈ వాలంటీర్లు తప్పిపోయిన అబ్బాయిని వెతికి పట్టుకొని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగినది. కళాశాల వాలంటీర్లు అమ్మవార్ల జాతరలు ఇంతటి సేవలందిస్తున్నందుకు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సీతారాం డాక్టర్ గంగిశెట్టి శ్రీనివాస్ డాక్టర్ గన్ సింగ్ అభినందనలు వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles