ఫిబ్రవరి 4న కార్మిక సంఘాల జిల్లా సదస్సు
హన్మకొండ జనవరి 29 పిసి డబ్ల్యు న్యూస్: కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎన్టి యుసి, ఏఐసిటియు కార్మిక సంఘాల సంయుక్త సమావేశం నిర్ణయించింది. బుధవారం రాంనగర్ లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో టి. ఉప్పలయ్య అధ్యక్షతన కార్మిక సంఘాల సంయుక్త సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి, ఏఐసిటియు జిల్లా కార్యదర్శి మొగిలి శ్రీనివాసరావు, ఐఎన్టియుసి జిల్లా ఉపాధ్యక్షులు కస్తూరి రవి మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేసిందని ఒక వైపున ప్రజా సంక్షేమం వల్లిస్తూనే 11 సంవత్సరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్ల రూపాయల రాయితీలను ఇచ్చిందని వారు విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీ వంటి బడా పెట్టుబడి దారులకు కట్టబెడుతూ అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోడులను అమలు విద్యుత్తు సవరణ చట్టం విత్తన బిల్లు, విబిజీ రాంజీ చట్టం, భీమా రంగంలోకి 100% విదేశీ పెట్టుబడులకు సంబంధించిన అనుమతి ఇచ్చి అనురంగంలోకి ప్రవేట్ కంపెనీలకు అనుమతి చట్టం చేసిందని వారు తీవ్రంగా విమర్శించారు. విద్యుత్తు ఉత్పత్తి రాజ్యాంగ వృత్య రాష్ట్ర జాబితాలోనిది ఇంతకాలం రాష్ట్రాల పోరాటం వల్ల కేంద్రం చట్టం చేయలేదు గత పార్లమెంటు సమావేశాల్లో విద్యుత్ సవరణ చట్టం 2025ను ఆమోదించింది ఈ చట్ట ప్రకారం ఇకనుండి విద్యుత్ ఉత్పత్తి సరఫరా పంపిణీ బాధ్యతలు కేంద్రం చూస్తుంది దీంతో విద్యుత్ చార్జీలు కేంద్రమే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ద్వారా నిర్ణయించడంతో స్మార్ట్ మీటర్లు పెట్టి ముందుగానే తారీకు వసూలు చేస్తారని మండిపడ్డారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 4 వ తేదీన హనుమకొండ లో కార్మిక సంఘాలు అన్నీ కలిపి జిల్లా సదస్సును నిర్వహిస్తామని దేనిని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు దాసరి నరేష్, బత్తిని సదానందం గౌడ్, గుంటి రాజేందర్ సోమగోటి రాజగోపాలాచారి, లు పాల్గొన్నారు.
