పరకాల, జనవరి 28 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ మొదటిరోజే ఉత్సాహంగా కొనసాగుతుంది.. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి అభ్యర్థులు పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో కలిసి అభ్యర్థులు వచ్చి తమ నామినేషన్లు సమర్పించడం విశేషంగా కనిపించింది. ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కగా, భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. నామినేషన్ల ప్రక్రియను ఎన్నికల అధికారులు పర్యవేక్షిస్తూ, నిబంధనల ప్రకారం స్వీకరిస్తున్నారు. పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా అభ్యర్థులు ముందుకు వస్తుండటంతో ఈసారి ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
