Saturday, March 7, 2026

పాత్రికేయుల సేవలు మరువలేము: బండారి లక్ష్మారెడ్డి..

ఉప్పల్, జనవరి 18 (పిసిడబ్ల్యూ న్యూస్): ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను సేకరించి వాటిని అధికారులకు, రాజకీయ నాయకులకు తెలియజేస్తూ, అభివృద్ధి కోసం ఆరాటపడే పాత్రికేయుల సేవలు మరువలేవన్నారు ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి. ఈ నేపథ్యంలో పి సి డబ్ల్యూ నూతన సంవత్సర కాలమానమును, పి సి డబ్ల్యూ రాష్ట్ర కోఆర్డినేటర్ పాత్రికేయులు కీర్తి సంతోష్ రాజ్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
వార్తలను సేకరించి, పరిశీలించి, విశ్లేషించి, ప్రజలకు నిజాయితీగా, స్పష్టంగా అందించే వృత్తే జర్నలిజమన్నారు. భావోద్వేగాలకు అతీతంగా, కేవలం వాస్తవాల ఆధారంగా పనిచేస్తూ, పక్షపాత ధోరణి లేకుండా వార్తలను అందించడం కోసం జర్నలిస్టు నిత్యం ఆరాటపడతాడంటూ కొనియాడారు. విషయాన్ని లోతుగా విశ్లేషించి, మూలాలను ధృవీకరించి, నిజాలను బయటకు తీసుకురాగల సామర్థ్యం ఒక్క జర్నలిస్ట్ కు మాత్రమే ఉందన్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెనుకాడకుండా, తమ లక్ష్యం కోసం నిరంతరం కృషి చేస్తారంటు అభినందించారు. సంక్లిష్టమైన విషయాలను కూడా సామాన్యులకు అర్థమయ్యేలా సరళంగా చెప్పగలగడం, తమ గురించి కాకుండా, ప్రజల గురించి, వారి సమస్యల గురించి రాయడం, ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపి, జవాబుదారీగా ఉండేలా చేయడంలో జర్నలిస్టులో పాత్ర మరువలేనిది అన్నారు. నిజమైన జర్నలిస్ట్ అంటే సమాజానికి దిక్సూచని, సత్యానికి ప్రతినిధని, ప్రజాస్వామ్యానికి కాపలాదారని, సామాజిక బాధ్యతలను భుజం మీద పెట్టుకుని, అన్యాయాలను ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తాడని అలాంటి జర్నలిస్టులకు నేను ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు డాక్టర్ బి.వి. చారి, బిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి, పల్లె నర్సింగ్ రావు,ఈరెల్లి రవీందర్ రెడ్డి, పల్లి రాజ్ కుమార్ గౌడ్, కొంపల్లి రాజకుమార్, శనిగరం తిరుమలేష్ , పాండురంగారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related Articles

Latest Articles