పరకాల జులై 15 ( పిసిడబ్ల్యూ న్యూస్ ):పరకాల పురపాలక సంఘం 15వ వార్డు మాజీ కౌన్సిలర్, మాజీ ఎంపీటీసీ,బి అర్ ఎస్ సీనియర్ నాయకుడు చందుపట్ల సాయి తిరుపతి రెడ్డి తల్లి చందుపట్ల రాధమ్మ సంవత్సరం క్రితం మృతి చెందగా ఆమె సంవత్సరిక వేడుకలకు, పరకాల జర్నలిస్టులు మంగళవారం హాజరయ్యారు. మొదటఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు భలే రావు బాబ్జి, నేరెళ్ల పరుశురామ్, బచ్చు పురుషోత్తం, దాసరి రమేష్, అంకెశ్వరపు ఐలయ్య, ఎండి పాషా, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
