Saturday, March 7, 2026

కామ్రేడ్ గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ సంస్మరణ సభలో పాల్గొన్న ఎమ్మెల్యేలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ మృతి చెందగా, శనివారం వెలిశాల గ్రామంలో నిర్వహించిన వారి సంస్మరణ సభలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  పాల్గొన్నారు.అనంతరం వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి,గాజర్ల కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related Articles

Latest Articles