పరకాల, జూన్ 28 (పీసీడబ్ల్యూ న్యూస్) ఆర్టీసీలో భక్తుల కోసం ప్రత్యేక స్పెషల్ టూర్ ప్యాకేజీల సౌకర్యం ఉందని ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. ఆర్టీసీ టూర్ ప్యాకేజీ లో భాగంగా శుక్రవారం పరకాల డిపో నుండి అరుణాచలం కు ప్రత్యేక డీలక్స్ బస్సు బయలుదేరిందని, ఇందులో ముల్లూరు, భద్రాచలం, పర్ణశాల, ధర్మపురి, బాసర, ముల్లూరు, మేడారం, రామప్ప, వేములవాడ, కొండగట్టు, గూడెం గుట్ట మరియు నాగార్జున సాగర్, శ్రీశైలం, బాసర, విజయవాడ విశాఖపట్నం లాంటి దూర ప్రాంతాలకు ఇందులో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామరకోట్ల లాంటి పుణ్యక్షేత్రాలు కూడా బస్సులు నడపబడనని, 35 మందితో ఒక గ్రూపు ఇటువంటి విహారయాత్రలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు వచ్చిన బస్సులు ఏర్పాటు చేయబడునని,మరిన్ని వివరాలకు 9705479088,9666919190,995922605 సంప్రదించవచ్చని డిపో మేనేజర్ రవిచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ కృష్ణకుమారి, అసిస్టెంట్ ఇంజనీర్ రాజశ్రీ పాల్గొన్నారు.
