కరీంనగర్, జూన్ 20 (పి సి డబ్ల్యూ న్యూస్) తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలో శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా, మల్కాపూర్ రోడ్ లో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనవి. ఈ పాఠశాలలో (1) నుండి (5) వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడీయెం మరియు (1) నుండి (10) వ తరగతి వరకు తెలుగు మీడీయెంలో భోదించబడును. ఈ పాఠశాలలో ఉచితంగా విద్య, భోజన వసతి అందించబడును. విద్యతో పాటు ప్రత్యేక సాప్ట్ వేర్ తో రూపొందించిన కంప్యూటర్ శిక్షణలో, వివిధ కళల్లో శిక్షణ అందించబడును. ఈ పాఠశాలలో చేరుటకు (6) నుండి (14) సంవత్సరముల మధ్య వయస్సు కలిగి ఉండి, జిల్లా మెడికల్ బోర్డు చే జారీ చేయబడిన సదరం సర్టిఫికెట్ (40%) నుండి (100%) అంధత్వం కలిగిన బాలబాలికలు అర్హులు. కావున కరీంనగర్ జిల్లా మరియు ఇతర జిల్లాలకు చెందిన అంధ బాలబాలికలను వారి తల్లిదండ్రులు, ఆ గ్రామాల్లోని ఉపాధ్యాయులు, సర్పంచ్ లు, గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థలు కరీంనగర్ లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో చేర్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతున్నట్లు ప్రపంచ అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్ సంప్రదించగలరు. 9440550345, 9701190124, 9700457939, 9440338424 ఈ క్రింది నంబర్స్ కి వాట్సాప్ ద్వారా మీ సదరం ఆధార్ కార్డు మీ udid cards కాంటాక్ట్ నంబర్స్ పంపించగలరని పేర్కొన్నారు.
