Saturday, March 7, 2026

గజస్తంభ ప్రతిష్టాత్మక ఉత్సవాలకు హాజరైన భూపాలపల్లి ఎమ్మెల్యే

రేగొండ, మే 20 (పిసిడబ్ల్యూ న్యూస్): రేగొండ మండలం గూడేపల్లి గ్రామంలో శ్రీ అభయ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా గజ స్తంభ నవగ్రహ విగ్రహ ప్రతిష్టాత్మక ఉత్సవాలకు ఆలయ కమిటీ చైర్మన్ సిరికొండ రవీందర్రావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు డింగరి వంశీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో గ్రామంలో మూడు రోజుల పూజల క్రమంలో భాగంగా ఈరోజు హోమం కుంకుమార్చన చేయడం జరిగింది. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి దర్శించుకుని అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు వచ్చి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది తను మాట్లాడుతూ పార్టీలకతీతంగా కలిసికట్టుగా గ్రామంలోని ప్రజలు చందాలు వేసుకొని గ్రామంలో గజ స్థంభం నిలుపుకోవడం చాలా మంచి పరిణామం అని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పంచనేని వెంకటరావు, లింగంపల్లి తిరుపతిరావు, పోలుసాని శ్రీనివాసరావు, మోర్ కుమార్ మరి ఆంజనేయ స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Latest Articles