పరకాల, జనవరి 17 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల సబ్ డివిజన్ లో అసాంఘిక శక్తుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండడానికి, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అదనపు సీసీ కెమెరాలు కీలకంగా మారనున్నాయి. ఆ దిశగా ఇప్పటికే 52 సిసి కెమెరాల నిఘా నేత్రాలతో పర్యవేక్షిస్తున్నారు. దీనిని మరింత పగడ్బందీగా అమలుపరిచేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తున్నామని, దీనివలన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షిస్తాయని పరకాల సిఐ క్రాంతికుమార్ తెలిపారు. నేరపరిశోధనలో సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా పనిచేస్తాయని,పరకాల పట్టణాన్ని ఏలాంటి అసాంఘిక కార్యక్రమాలకు గాని మత్తుపదార్థాలు, డ్రగ్స్ యువత చెడు మార్గం పోకుండా, పోలీసు నిఘానేత్రంలో 24 గంటలు ఈ సీసీ కెమెరాలు పనిచేస్తాయని, సీసీ కెమెరాల వల్ల కేసుల పరిష్కారం సులువు ఆవుతుందని, నేర శోధన, నేర నివారణకు ఎంతో తోడ్పడతాయని, ఎలాంటి సంఘటన జరిగిన వేగవంతంగా పరిశీలించేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతో దోహద పడతాయని సీఐ తెలిపారు. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలో సీసీ కెమెరాల ఫుటేజ్ వల్లనే వేగవంతంగా సమస్యలను పరిష్కరించినట్లు సీఐ తెలిపారు. ఏసిపి పర్యవేక్షణలో పరకాల సబ్ డివిజన్ లో శాంతి భద్రత పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నామని వారు తెలిపారు.