Thursday, July 9, 2026

పిల్లల ప్రైవేట్ ఆస్పత్రిలో మెడికల్ షాప్ బిల్లులపై ఆరోపణలు..

పరకాల, పీసీడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పిల్లల ఆస్పత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాప్‌లో రోగుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో వైద్యుడు సూచించిన మందులను తప్పనిసరిగా అదే మెడికల్ షాప్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని కొందరు రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, అవసరానికి మించి మందులు రాస్తున్నారని, వాటి కారణంగా చికిత్స ఖర్చు సాధారణ కుటుంబాలకు భారంగా మారుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ వైద్యుడు దాదాపు 26 సంవత్సరాల అనుభవం కలిగి ఉండటంతో ప్రజలు విశ్వాసంతో ఆస్పత్రిని ఆశ్రయిస్తున్నప్పటికీ, ఇటీవల వినిపిస్తున్న ఈ ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది రోగుల బంధువులు ఒకే మందులకు ఇతర మెడికల్ షాపులతో పోలిస్తే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బిల్లులు, మందుల ధరలు, ప్రిస్క్రిప్షన్లపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని స్థానికులు కోరుతున్నారు. అదే సమయంలో ఆస్పత్రి యాజమాన్యం కూడా ఈ ఆరోపణలపై స్పందించి తమ వివరణ ఇవ్వాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. విచారణ అనంతరం వాస్తవాలు ఏవైనా ఉంటే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Latest Articles