Monday, October 26, 2026

⛽ రెండు పంపులున్నా వాహనదారులకు తప్పని తిప్పలు

పరకాల: పట్టణంలోని హుజూరాబాద్‌ రోడ్డులో ఉన్న ఓ పెట్రోల్ బంక్‌లో రెండు పంపులు ఉన్నప్పటికీ వాహనదారులకు సరిగా సేవలు అందడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంపులు అందుబాటులో ఉన్నా ఉపయోగం లేకుండా పోవడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై ప్రశ్నిస్తే వర్కర్లు స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తున్నది వర్కర్ల నిర్లక్ష్యమా? యాజమాన్య పర్యవేక్షణ లోపమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత యాజమాన్యం స్పందించి, పంపుల పనితీరును పరిశీలించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని వాహనదారులు కోరుతున్నారు.

Related Articles

Latest Articles