Sunday, September 20, 2026

టెన్త్ అర్హతతో జాబ్స్.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల గడువు

దేశవ్యాప్తంగా పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాల్లో అవకాశం కల్పించారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో ముగియనుండటంతో అర్హత ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థులను టెన్త్ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. టెన్త్‌లో గణితం, స్థానిక భాషలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండటం తప్పనిసరి. అభ్యర్థులు ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా గడువులోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Related Articles

Latest Articles