భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా సీసీఎస్ సీఐ రమేష్ ఆధ్వర్యంలోనీ సిసిఎస్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక దాడుల్లో భాగంగా, భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తపల్లి (ఎస్‌ఎం) గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 07 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి పేకాటలో వినియోగిస్తున్న ₹4,850/- నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న నగదుతో పాటు, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపిఎస్ ప్రజలను హెచ్చరిస్తూ, పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇటువంటి కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు తమ పరిసరాల్లో ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు గమనించినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా జిల్లా పోలీసులకు సమాచారం అందించాలని కోరడం జరిగింది.
