Thursday, June 25, 2026

ప్రతి ఓటరు ఫారం నింపి BLOలకు అందజేయాలి: అధికారులు

 పరకాల, జూన్ 25 పిసీడబ్ల్యు న్యూస్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR-2026) కార్యక్రమంలో భాగంగా గురువారం పరకాల మండలంలోని కామారెడ్డిపల్లి గ్రామంలో రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) పరకాల మరియు స్థానిక తహసీల్దార్ పర్యటించారు. ఈ సందర్భంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) పాల్గొని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ప్రతి ఓటరు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అవసరమైన వివరాలను సక్రమంగా నమోదు చేసి సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్‌కు అందజేయాలని అధికారులు సూచించారు. ఓటరు జాబితా పారదర్శకంగా, ఖచ్చితంగా రూపొందేందుకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ఎంతో కీలకమని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియను విజయవంతం చేయడానికి ప్రతి ఓటరు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల సిబ్బంది, గ్రామస్థులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles