రామడుగు, నవంబర్18( పి సి డబ్ల్యూ న్యూస్ )కరీంనగర్ కమీషనరేట్ పరిధిలోని రామడుగు పోలీస్ స్టేషన్ నుసోమవారంనాడు కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సందర్శించారు. పోలీస్ స్టేషన్ లో గల పెండింగ్ కేసులపై సమీక్ష చేసారు. వాటికి గల కారణాలు తెలుసుకున్నారు. త్వరితగతిన వాటిని పూర్తి చేయాలనీ సూచించారు. విసిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి చూపుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లో, గ్రామాల్లో, వార్డుల్లో వీధి రౌడీలుగా చలామణి అవుతూ గ్రూపులుగా ఏర్పడి, సామాన్య ప్రజలను బెదిరింపులకు గురిచేసినా ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిని గుర్తించి వారిపై రౌడీ షీట్లు తెరవాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సూచించారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసివారికదలికలనుఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా పరిధి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామ ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. పెండింగ్ వారెంట్ల అమలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై చర్చించారు. తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలన ఆక్సిడెంట్ జోన్ లుగా, బ్లాక్ స్పాట్స్ గా గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకై చర్యలు చేపట్టాలన్నారు.
честные казино с быстрыми выплатами
бездепозитные бонусы казино
играть в лучшем казино на деньги
база казино с бездепозитным бонусом
онлайн казино России
casino oyunu
గంజాయి రవాణా, అక్రమ ఇసుక రవాణా పి.డి.ఎస్. బియ్యం, పేకాట స్థావరాలను గుర్తించి ఆడేవారిని పట్టుకోవడం, వాటిపై ఉక్కుపాదం మోపాలన్నారు.
ఈ కార్యక్రమంలో రామడుగు పోలీస్ స్టేషన్ ఎస్సై వి.శేఖర్ తో పాటు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.