మానసా దేవి అలంకారము తో భక్తులకు దర్శనం ఇచ్చిన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు.. - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

మానసా దేవి అలంకారము తో భక్తులకు దర్శనం ఇచ్చిన వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు..

ఖమ్మం  (పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి): ఖమ్మం గుట్టల బజారు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవ్యాలయము 48వ శరన్నవరాత్రోత్సవములో భాగంగా శనివారం శ్రీ మానసా దేవి అలంకారము తో వచ్చిన భక్తులకు దర్శనమిచ్చారు . సుప్రభాతసేవ గణపతి పూజ , మండపార్చనలు , అమ్మవారి ఉత్సవ మూర్తికి పంచామృతాభిషేకములు , అర్చన , నవగ్రహ జపములు , నవగ్రహ ఆరాధనలు , కోవెల సేవ , అమ్మవారికి కుంకుమార్చన , అవతార మూర్తి సహిత మూలమంత్రపూర్వక , అలంకార దేవతా హవనములు , నరఘోష శతృఘోష , పరిహారార్ధం “మహాసుదర్శన హోమములు”, సర్వాభివృద్ధికై “ఆదిత్యాది నవగ్రహ హవనములు” వంటి కార్యక్రమాలను నిర్వహించారు . ముఖ్యఅతిథిగా జడ్జి శ్రీ జి రాజగోపాల్ – విద్యులత దంపతులు పాల్గొన్నారు . వారిని కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు . ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మేళ్ళచెర్వు వెంకటేశ్వరరావు , ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్ , కోశాధికారి కొత్తమాసు హేమసుందరరావు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles