Saturday, March 7, 2026

తెలంగాణ డీజీపీగా జితేందర్

హనుమకొండ ప్రతినిధి: జూలై 10 (పిసిడబ్ల్యూ న్యూస్) రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేసింది. 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి అయిన జితేందర్.. నిర్మల్ ఏఎస్పీగా, బెల్లంపల్లి అదనపు ఎస్పీగా, మహబూబ్నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా, విశాఖ రేంజ్ డీఐజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్య దర్శిగా ఉన్నారు.

Related Articles

Latest Articles