చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలం - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే భార్య ఆత్మహత్య కలకలం

రామడుగు, జూన్ 21( పిసిడబ్ల్యూ న్యూస్): కరీంనగర్‌ జిల్లా చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ అల్వాల్‌లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఈ ఘటన జరిగింది. ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. రూపాదేవి వికారాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.. రూపాదేవి మృతదేహాన్ని కొంపల్లిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా.. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని తెలుస్తోంది. ఎమ్మెల్యే సత్యం ఉదయమే నియోజకవర్గానికి వెళ్లగా.. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారని సమాచారం. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సత్యం కుటుంబం బంధువులతో కలిసి తిరుమల సహా పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. ఇంతలోనే ఏం జరిగిందనే చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం అర్ధరాత్రి బయటకు వచ్చింది.. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles