Saturday, March 7, 2026

పరకాల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడిని తొలగించిన మాజీ ఎమ్మెల్యే చల్లా

హనుమకొండ జిల్లా పరకాల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా పనిచేస్తున్న మడికొండ శ్రీనివాస్ నీ తొలగిస్తున్నట్లు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయడం కాకుండా పార్టీపై బయట అసత్య ప్రచారం చేస్తున్న ఆయనను పార్టీ నిబంధనల మేరకు పార్టీ నుండి పదవి నుండి తొలగిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఆదివారం ధర్మారెడ్డి పరకాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles