విశ్వసనీయతతోనే తక్కళ్ళపల్లి రవీందర్ రావు కి గుర్తింపు - ఎమ్మెల్యే దొంతి - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

విశ్వసనీయతతోనే తక్కళ్ళపల్లి రవీందర్ రావు కి గుర్తింపు – ఎమ్మెల్యే దొంతి

నర్సంపేట, ఏప్రిల్ 4(పిసిడబ్ల్యూ న్యూస్): నర్సంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులైన తక్కళ్లపల్లి రవీందర్ రావు కి మహిళా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం ఏర్పాటు చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రవీందర్ రావు ని శాలువాతో సత్కరించి దీవించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ పార్టీకి విధేయతతో పనిచేసిన ప్రతి కార్యకర్తను కంటికీ రెప్పలా కాపాడుకుంటానని, మీ విశ్వసనీయతే మీకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తుందని, ప్రతి ఒక్క నాయకుడు నిష్పక్షపాత ధోరణితో ముందుకు సాగాలని సూచించారు. తదనంతరం మహిళా కాంగ్రెస్ కమిటీ బాధ్యులు వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులైన రవీందర్ రావు ని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles