చిట్యాల, మార్చి 3 (పిసిడబ్ల్యూ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జుగల్ గ్రామంలో గల బిఎన్నార్ ఫంక్షన్ హాల్ లో చిట్యాల టేకుమట్ల మొగుళ్ళపల్లి మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం బిజెపి జిల్లా అధ్యక్షుడు ఏడు నూతల నిశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ సభా అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్లమెంట్ ప్రబారి మురళీధర్ గౌడ్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి చందుపట్ల కీర్తిరెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం సంరక్షణ కోసం నిరంతరం విరామం లేకుండా శ్రమిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టాడని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు చూసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మళ్లీ మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడు పైన ఉన్నదని కార్యకర్తలు ఒక సైనికులు లాగా పనిచేసి వరంగల్ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని వారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ నాగపూర్ రాజమౌళి గౌడ్ పార్లమెంట్ కన్వీనర్ తల పెళ్లి కుమారస్వామి గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న చదువు రామచంద్ర రెడ్డి కన్నం జగదీశ్వర్. పార్లమెంట్ కో కన్వీనర్.లింగంపల్లి ప్రసాద్ రావు అసెంబ్లీ కన్వీనర్ మోర్ రవీందర్ రెడ్డి టేకుమట్ల మండల అధ్యక్షులు గోపాల్ మొగుళ్ళ పల్లి మండల అధ్యక్షులు. శేవ్వ శేషగిరి మండల ప్రధాన కార్యదర్శిలు మాచర్ల రఘు, శ్రీపెల్లి అనిల్ కామెడీ నారాయణరెడ్డి.సుద్దాల వెంకన్న శ్రీనివాస్ గౌడ్. మహిళా మార్చ నాయకులు వుడుత వనక్క సింధు సింధుజ గజనాల రవీందర్. వల్లల ప్రవీణ్ రాయని శ్రీనివాస్ జిల్లా మండల నాయకులు భూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జులు వివిధ మోర్ ర్చాలా అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు పాల్గొన్నారు.