అయోధ్య రామ మందిర నిర్మాణానికి 25000/- రూపాయలను విరాళంగా ఇచ్చిన పైడాకుల అశోక్
ములుగు జిల్లా ములుగు మండల కేంద్రంలోని కాసిందేవిపేట గ్రామంలోని అయోధ్య రామ మందిర నూతన నిర్మాణానికి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు 25000/- రూపాయలు విరాళంగా ఇచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా అశోక్ గారు మాట్లాడుతూ మనందరి ఆరాధ్య దైవం శ్రీ రాముడు అని రామరాజ్య పాలన మనందరికీ సుభిక్షం అని ప్రతి గ్రామంలో రాముడి ఆలయం నిర్మించాలని రాముడి నీతిని ప్రతి ఒక్కరికీ చాటేలా మనుషుల్లో మానవత్వం ప్రజ్వరిల్లేల ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మన ఆరాధ్య దైవం రాముడిని ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని కొలుచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ఎండి.అహ్మద్ పాషా అయోధ్య రామాలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పురుషోత్తం రావు గౌరవ అధ్యక్షులు మోహన్ రావు ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి విజేందర్ తదితర నాయకులు పాల్గొన్నారు.