కాంగ్రెస్ పార్టీలో చేరిన బండి శ్రీధర్ ముదిరాజ్ - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

కాంగ్రెస్ పార్టీలో చేరిన బండి శ్రీధర్ ముదిరాజ్

పరకాల, మార్చి 26 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన సింగిల్ విండో డైరెక్టర్, శ్రీ కుంకుమేశ్వర దేవస్థానం-పరకాల డైరెక్టర్, ముదిరాజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శ్రీధర్ సోమవారం పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్ బండారి కృష్ణ, తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బండి శ్రీధర్ మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పదములో ముందుకు తీసుకువెళ్తున్నారని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, జిల్లా నాయకులు సోదా అనిత రామకృష్ణ, కౌన్సిలర్లు, జిల్లా నేతలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles