వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య..? - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య..?

పరకాల, మార్చ్ 24 (పిసిడబ్ల్యూ న్యూస్): వరంగల్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ పోలీసు అధికారి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దొమ్మటి సాంబయ్య ను వరంగల్ లోకసభ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాంగ్రెస్ అధిష్టానం సోమవారం ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వనీయవర్గాల సమాచారం. 2004 లో దొమ్మటి సాంబయ్య ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో ఆనాటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు సిఐ పోస్టుకు రాజీనామా చేసి పరకాల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి సార్వత్రిక ఎన్నికల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో ఒకటి, రెండు పార్టీలు మారిన.. టీ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తన వంతు కృషి చేశారు. వరంగల్ కు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, నాయకులతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. రాబోయే రెండు రోజులలో వరంగల్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థిగా దొమ్మటి సాంబయ్య ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు విశ్వనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles